వ్యవసాయ రంగ వ్యాసకర్తగా గుర్తింపు పొందినటువంటి దాసరి ఆల్వారస్వామి రచనలు అమోఘం అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కొనియాడారు. ఆల్వారస్వామి రచించిన అమరావతి రాజధాని రథసారథులు-2024 (మంత్రులు-సభాపతులు) పుస్తకాన్ని ఆదివారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం ఆల్వారస్వామికే దక్కిందని ఆయన కొనియాడారు.