ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వరదనీటి ప్రవాహంతో సోమవారం బ్రిడ్జి కోతకు గురయింది. జాతీయ రహదారిపై బ్రిడ్జి పక్కన రహదారి కొట్టుకుపోయింది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సంఘటనా స్థలంలో పరిస్థితిని రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.