నాగాయలంక ప్రధాన సెంటర్ లో ఉన్న డా. బీ. ఆర్. అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసుకునేందుకు పంచాయతీ అనుమతి ఇవ్వాలని మండల ఎస్సీ నేతలు కోరారు. మంగళవారం నాగాయలంక పంచాయతీ కార్యదర్శి జె. పవన్ కుమార్ కి ఎస్సీ నేతలు మంచాల తిరుపతి వరప్రసాద్, బట్టు జయపాల్, తానంకి పోతురాజు, ఎన్ బాబురావు, దాసరి శేఖర్, కె. శంకర రావు కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.