కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి డెమోక్రటిక్ పిఆర్టియూ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కేంద్రాన్ని అవనిగడ్డలో సోమవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీను మాట్లాడుతూ, ఉపాధ్యాయులు నవంబర్ ఆరవ తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుంటున్నామని, ఎప్పటికప్పుడు సంఘపక్షనా ప్రాతినిధ్యం చేస్తున్నామన్నారు.