అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన లింగం అనిల్ కుమార్ తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం బాటిళ్లు అమ్ముతున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియటంతో ఆదివారం నాగాయలంకలోని మద్యం షాపు నుండి అనిల్ 50 మద్యం బాటిళ్లు తీసుకుని తన వాహనంలో తీసుకెళ్తుండగా, తనిఖీలో ఉన్న ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో అతడిని పట్టుకున్నారు. వాటిని స్వాధీనం పరుచుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.