దీపావళి సందర్భంగా బాణసంచా తయారు చేసే వారు నిబంధనలు పాటించాలని సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ సూచించారు. ఆదివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి పొందిన తయారీదారులే మందుగుండు సామగ్రి తయారుచేయాలని చెప్పారు. అనుమతులు లేనివారు తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.