పిల్లలను దేశం గర్వించదగ్గ పౌరులుగా పెంచాలని తల్లిదండ్రులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. శనివారం సాయంత్రం నిడదవోలులో అధికారుల నిర్వహించిన భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టాలని, బాలికల విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గర్భిణులకు పోషకాహార కిట్లను ఆయన అందజేశారు.