రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల ద్వారా 50 కొత్త బెడ్లు అందించడం జరిగింది. మంత్రి వాసంశెట్టి శుభాష్ మంగళవారం ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రస్తుతం చిన్న పిల్లలు వైరల్ జ్వరాల వల్ల ఎక్కువగా ఆసుపత్రికి వస్తున్నారని, 100 పడకల ఆసుపత్రిలో 70 బెడ్లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధులు సమర్థంగా నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.