ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపనందరెడ్డి కోరారు. శుక్రవారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం నుండి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.