రైల్వే కోడూరులో నూతన కూటమి ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమ వారిని పెట్టుకోవాలని రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం రైల్వే కోడూరు సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగులను తొలగించడం, కొత్తవారిని పెట్టుకోవడం, రాజకీయంగా వేధించడం సరైనది కాదని అన్నారు.