ముద్దనూరులో భగ్గుమన్న వర్గ విభేధాలు..

61பார்த்தது
కడప జిల్లా ముద్దనూరు పట్టణంలో శుక్రవారం బిజేపి ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, టిడిపి జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ భూపేష్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముద్దనూరు మద్యం దుకాణ ప్రారంభోత్సవంలో ఈ ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు భారీగా మోహరించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తెదేపా ఇన్ ఛార్జి భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సొంత అన్న కొడుకు కావడం విశేషం.

தொடர்புடைய செய்தி