భారీ వర్ష సూచన.. హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల

84பார்த்தது
భారీ వర్ష సూచన.. హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర సహాయక చర్యల నేపథ్యంలో విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. అత్యవసర సమయంలో 1070, 112, 18004250101 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி