చేబ్రోలు: అప్పాపురం కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పరిధిలోని అప్పాపురం కాలువలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చింది. రైతులు చేబ్రోలు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ వెంకటకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతదేహం ఎక్కడి నుంచి వచ్చిందో ఆనవాళ్ళ కోసం పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.