దీపావళి పండుగను పురస్కరించుకుని పట్టణంలో బాణాసంచా గోడౌన్లు యజమానులు, దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ లు తీసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని పొన్నూరు తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ అన్నారు. బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. దీపావళి స్టాల్స్ దగ్గర ప్రమాదాలు నివారణ చర్యలు పటిష్టంగా ఉండేటట్లు చూడాలని సూచించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.