చేబ్రోలులో మహిళ మిస్సింగ్ కేసు నమోదు
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు పోలీస్ స్టేషన్లో బుధవారం మహిళా మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం పాత రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మద్దు జయమ్మ తన కోడలు గత మంగళవారం గొడవపడ్డారని సాయంత్రం నుంచి జయమ్మ కనబడటం లేదని భర్త శామ్యూల్ ఫిర్యాదు చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ మీడియాకు తెలిపారు.