వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేసిందని పొన్నూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస రెడ్డి శనివారం తెలిపారు. 2024- 2025లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు తెలియజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.