వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు: కమిషనర్

61பார்த்தது
వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు: కమిషనర్
ఏబిసి సెంటర్లో ప్రతి రోజు 100కు తగ్గకుండా వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్ సర్జరీలు చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ పి. శ్రీనివాసులు తెలిపారు. అదివారం కమిషనర్ గుంటూరు ఏటుకూరు రోడ్ లోని ఏబిసి సెంటర్ ను పరిశీలించారు. ప్రతిరోజు తెస్తున్న కుక్కలు, ఆపరేషన్ చేసిన కుక్కల వివరాలను రిజిస్టర్ లో పరిశీలించారు. నగరంలో వీధి కుక్కలపై నియంత్రణపై ఫిర్యాదులు అందుతున్నందున నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி