గుంటూరు: నవంబర్ 7న ఛలో విజయవాడ: ఏపీఎంఎస్ఆర్ యూ
ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఈ నెల 7న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతుందని ఏపీఎంఎస్ ఆర్ యూ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సలీమ్ వెల్లడించారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం ఛలో విజయవాడ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సలీమ్ మాట్లాడుతూ నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, మెడికల్ రిప్ లకి రూ. 26వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.