చిలకలూరిపేట పట్టణంలోని పారిశుధ్య పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు శానిటేషన్ అధికారులు, సిబ్బందిని సూచించారు. గురువారం నగరంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో పారిశుధ్య పనులు, ట్రేడ్ లైసెన్సు, హాజరు అంశాలపై శానిటేషన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేలా చూడాలని సూచించారు.