కొరిశపాడు మండలం, మేదరమెట్లలోని, సోమవరప్పాడు నందు శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో అద్దంకి రూరల్ సీ. ఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా యువత మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడి, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాయని, మత్తుకు బానిస కాకుండా యువకులకు ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాల అధికమయ్యాయని వాటి పై యువకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.