AP: రాష్ట్రంలో ఇల్లు, భవనాలు నిర్మించుకునే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భవన నిర్మాణాల కోసం ఐదంతస్తుల వరకూ ఎలాంటి అనుమతి అవసరం లేదని మంత్రి నారాయణ తెలిపారు. నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. అలాగే లేఅవుట్, భవనాలకు సంబంధించిన ఫీజును చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో చెత్త సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు.