AP: విద్యార్థుల తల్లిదండ్రులు జనవరి 26లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందిచాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధవారం కృతికా శుక్లా మాట్లాడుతూ.. "ఇది 10 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన అంశం. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలిస్తాం. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం." అని తెలిపారు.