మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు ఆదివారం రాత్రి మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ప్రమాదకరంగా ఉంటాయని, తదుపరి ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు. కావున మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో విజ్ఞప్తి చేశారు.