కైకలూరు వైసిపి ఎంపీపీ అడవి కృష్ణ బుధవారం ఎట్టకేలకు సొంత గూటికి చేరారు. మాజీ మంత్రి మరియు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమక్షంలో ఆయన బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, కామినేని కండువా కప్పి అడవి కృష్ణను పార్టీకి ఆహ్వానించారు. అడవి కృష్ణతో పాటు పలువురు వైసిపి నాయకులు కూడా బిజెపిలో చేరారు. సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లుగా అనిపించిందని అడవి కృష్ణ అన్నారు.