జగన్ హయాంలోనే విద్యుత్ ఛార్జీల పెంపు: మంత్రి గొట్టిపాటి

72பார்த்தது
జగన్ హయాంలోనే విద్యుత్ ఛార్జీల పెంపు: మంత్రి గొట్టిపాటి
AP: కూటమి ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదన మాజీ సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఛార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయని గుర్తు చేశారు. ఎన్నికల దృష్యా వసూలు ఉత్తర్వులు ఇవ్వకుండా.. ఎన్నికలు ముగిశాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈఆర్సీ అనుమతిచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி