ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే కొనసాగుతానని, లేదంటే రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమిస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వెలమ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రిలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన ఎమ్మెల్యేను వెలమ సంఘీయులు గజమాలతో సన్మానించారు.