ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి రాజమండ్రిలో ట్రస్ట్ తరఫున సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఉదయం 10: 30 గంటలకు ప్రకాష్ నగర్లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభిస్తారన్నారు. అనంతరం అంబులెన్స్ సేవలను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరులో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభిస్తారని తెలిపారు.