లోక్ సభ మాజీ స్పీకర్ స్వర్గీయ జిఎంసి బాలయోగి జయంతి సందర్భంగా రాజమండ్రిలోని కంబాల చెరువు ఆవరణలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాలయోగి చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.