గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో భక్తులందరు వినాయక నిమజ్జోత్సవాలను రెండు రోజుల తర్వాత నిర్వహించుకోవాలని తూ. గో కలెక్టర్ ప్రశాంతి సూచించారు. మంగళవారం రాత్రి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ, కొవ్వూరు ప్రాంతాలలో గోదావరి వరద ఉద్ధృతిని స్థానిక అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఎవరూ గోదావరి నది వైపు వెళ్లకూడదని, ఈ 2 రోజుల పాటు నిమజ్జనోత్సవాలు నిర్వహించద్దని సూచించారు.