పిఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకుని బలోపేతం కావాలనీ, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పిఎం శ్రీ పాఠశాలలు ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్ తో కలిసి పిఎం శ్రీ స్కూల్ కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల హెచ్ఎంలు, ఎంఇఓలతో సమావేశం నిర్వహించారు.