మా ఇంటిని కానిస్టేబుల్ కబ్జా చేశాడు
నకిలీ పత్రాలను సృష్టించి కానిస్టేబుల్ మా ఇంటిని కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితుడు విజయ్ కుమార్ వాపోయారు. ఆయన శనివారం తిరుపతి ప్రెసెక్లబ్లో విలేకరులతో మాట్లాడారు. తాము 2012లో తిరుచానూరు పంచాయతీ సర్వే నంబర్ 260లోని 50 అంకణాల ప్లాటును లలితకుమారి నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. ఈస్టు పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సాంబయ్య తప్పుడు డాక్యుమెంట్ ను సృష్టించాడని ఆరోపించారు.