తిరుమల గిరులను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సోమవారం సాయంత్రం నుంచి తిరుమలలో పొగమంచు, వర్షం కురుస్తుండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. పొగమంచుతో నిండిన తిరుమల అందాలను చూస్తూ భక్తులు మైమరిచిపోతున్నారు. శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చేసరికి వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.