చిత్తూరు జిల్లా, పుత్తూరు పట్టణంలోని తిమ్మాపురం లో డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ సిబ్బందిని పరిష్కరించాలని గ్రామస్థులు తెలిపారు. ఒకవేళ సిబ్బంది పరిష్కరించకపోతే ఇంటింటికీ చందాలు వేసుకొని సమస్యను పరిష్కరించు కుంటామని శుక్రవారం స్థానిక ప్రజలు అన్నారు. నెల రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తుందని వారు వాపోయారు. దీంతో ప్రజలకు విష జ్వరాలు వస్తాయోమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.