చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్ రోడ్డులో అధికారులు వేగ నియంత్రణకు చర్యలు శనివారం చేపట్టారు. వరుస ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్న కారణంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. వారి ఆదేశాలతో శనివారం సాయంత్రం ఆర్డీఓ, డిటిఓ, ఆర్&బి ఈఈ, డిఈఈ, ఎన్ హెచ్, పోలీస్ అధికారులు మొగలి ఘాట్ రోడ్డును పరిశీలించారు.