చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలోని తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు శ్రీఆరిమాని గంగమ్మ నవరాత్రులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయంలో ఉన్న నాగాలమ్మ ఆలయం నుంచి పుట్టమట్టిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. హోమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, తయ్యూరు పాయకట్టు ప్రజలు పాల్గొన్నారు.