మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ ఉంచేందుకు మంత్రి నారా లోకేశ్ దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా 5 గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలుతో పాటు వాటిని వినియోగానికి ఐదుగురు కార్మికులను నియమించారు. వీరికి అవసరమైన జీతభత్యాలను లోకేశ్ సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఆదివారం నుంచే వారితో మంగళగిరి పానకాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్డును శుభ్రం చేయించారు.