ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటానికి ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్దంగా ఉందని ఆ సంస్థ ఈడీ వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఆయన చిలకలూరిపేటలో విస్తృతంగా పర్యటించారు. చిలకలూరిపేట నుంచి విజయవాడ వెళ్లే బస్సులో ప్రయణించి, ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో సౌకర్యాలు, ప్రయాణికుల సమస్యలు గురించి ఆరా తీశారు.