కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారస్తులందరూ దీపావళి మందులు అమ్మకాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్సై మహమ్మద్ రఫీ శుక్రవారం తెలియచేశారు. తమ్మవరం రోడ్డులో దీపావళి మందుల అమ్మకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అనుమతి లేకుండా ఎవరైనా ముందస్తుగా దీపావళి మందులు నిల్వ ఉంచితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహమ్మద్ రఫీ హెచ్చరించారు.