తన కుమారుడు వెంకారెడ్డికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని హరికృష్ణ రెడ్డి అనే అతను మూడు దఫాలుగా తన వద్ద నుండి సుమారు నాలుగు లక్షలు తీసుకొని మోసం చేశాడని చీరాలలో కొత్తపాలెం పంచాయతీకి చెందిన కోటిరెడ్డి సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ తుషార్ డుడి కి ఫిర్యాదు చేశారు. రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం గురించి అడుగుతున్న ఏదో ఒక సాకు చెబుతున్నాడని ఆయన మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.