కురబలకోట ఫ్లైఓవర్ దగ్గర శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఖాదర్ భాషా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు డి. ఎస్. పి కొండయ్య నాయుడు తెలిపారు. శనివారం హత్య జరిగిన ప్రదేశంలో డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీంల సాయంతో ఆధారాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. హత్య వివాహేతర సంబంధంతో జరిగే ఉంటుందన్న అనుమానంతో నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు