ఈనెల 23వ తేదీ బుధవారం కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ జగన్నాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశాన్ని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి, నగర పంచాయతీ ఛైర్పర్సన్ మేరీ అధ్యక్షతన సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.