రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు మొదటి కూలీ గానే పనిచేస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. శుక్రవారం బెళుగుప్ప మండలం బి. రామసాగరంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తెలిపారు.