శింగనమల మండలం శివపురం గ్రామంలో వీఆర్ఎ ఓబుళపతి ప్రజల ఇంటి నివాస స్థలాలను కాజేశారని బాధితులు ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వీఆర్ఎ తీరుపై తహసీల్దార్ బ్రహ్మయ్యకు ఫిర్యాదు చేశారు. 531 సర్వే నంబరులోని నివాస స్థలాలను వీఆర్ఎ తన భార్య పేరు మీద పట్టాలు పొందినట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.