నార్పల మండల కేంద్రంలోని కుతలేరు వంతెన సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు ఏటీఎం మిషన్ను ధ్వసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఏటీఎంలో ఎంత నగదు పోయిందన్న విషయం తెలియలేదు. బ్యాంక్ అధికారులు రాగానే పూర్తి వివరాలు తేలిసే అవకాశం ఉంది.