పుట్టపర్తిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం, బీసీ హాస్టల్ ను శనివారం వైద్యాధికారి డాక్టర్ మునిచంద్రిక సందర్శించి, హాస్టల్ లోని విద్యార్థుల ఆరోగ్యము గురించి పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం విద్యార్థులకు వ్యక్తిగత అంటువ్యాదులు, రక్త హీనత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో సామాజిక ఆరోగ్య అధికారి నగేష్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కుర్షద్ అలి, ఆరోగ్య కార్యకర్త సుహాసిని పాల్గొన్నారు.