రోళ్ల మండలం అవినకుంట అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం కాలం చెల్లిన కందిపప్పును కూటమి నాయకులు గుర్తించారు. సూపర్వైజర్ సన్నమ్మ, రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు. 2023 డిసెంబర్ నెలకు చెందిన కంది పప్పును డీలర్ దయానంద్ రేషన్ షాప్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు అందించినట్లు గుర్తించారు. అందుకు కారణంగా పప్పు సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.