కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, వృద్ధులు పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద చేరుకొని అక్కడ వారు మాట్లాడుతూ వృద్ధాప్యం శాపంకాదు వృద్ధాప్యం ఒకవరం అన్నారు. వృద్ధుల మాట సద్ది అన్నపు మూట, తల్లిదండ్రుల పోషణ పిల్లల బాధ్యత అన్నారు. వృద్ధాశ్రమాల ఏర్పాటు ప్రభుత్వ బాధ్యత అన్నారు. వృద్ధులను ఆదరించాలన్నారు.