బట్రేపల్లి జలపాతం శనివారం కనువిందు చేస్తోంది. తలుపుల మండలంలోని కదిరి - పులివెందుల మార్గంలోని బట్రేపల్లి అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో పైన ఉన్న మునీశ్వర కుంట నిండిపోయింది. అక్కడి నుంచి నీరు పరవళ్లు తొక్కతూ బట్రేపల్లి జలపాతం నుంచి కిందకు దూకుతోంది. ఆ దారి వెంట వెళ్లే జనం ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మైమరచిపోతున్నారు. సెల్ఫోన్లలో పాతం హొయలు చిత్రీకరిస్తూ ఆనంద పడుతున్నారు.