విజయవాడ వరద బాధితుల కోసం జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయశ్రీ, ఆమె భర్త రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి నరసింహులు సోమవారం రూ. 2 లక్షల విరాళం అందించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సత్యకుమార్ యాదవ్ ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.