అనంతపురంలోని రాయల్ నగర్ లో ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఆకుతోటపల్లి ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజుల నిమిత్తం రూ. 70, 000 లు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ నాయనపల్లి రాజు మాట్లాడుతూ విద్యార్థుల చదువు కోసం తమ సొసైటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆకుతోటపల్లి ఈడిగ సంఘం నాయకులు శ్రావణ్ కుమార్ గౌడ్, బలరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.